Search This Blog

Thursday, September 16, 2010

Love








ఈ ప్రేమ అనేది యవ్వనంలో కలిగే ఆకర్షణ, మోహం అని ఎవరికి తోచినట్లు వారు అభివర్ణిస్తారు.

ఇలా ప్రేమపై... ఎవరు ఎలా చెప్పినప్పటికీ... చిట్టచివరికొచ్చేసరికి ప్రేమ ఎంతో పవిత్రమైనదని అందరూ ముక్తకంఠంతో చెప్తారు. ఎందుకంటే ప్రేమ రుచిని, తీయదనాన్ని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో అనుభవించే ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు.

ఇంతమంది ఇన్ని విధాలుగా చెబుతూ ఉన్నప్పటికీ ప్రేమ మాత్రం తన స్థానాన్ని ప్రతి ప్రేమ హృదయంలోనూ పదిలంగానే ఉంచుకుంది.

ఎప్పటికప్పడు తన మాధుర్యాన్ని ఒలికిస్తూ... ప్రేమికుల హృదయాలను ప్రేమలోకంలో విహరింపజేస్తోంది. అయితే ఈ అపురూపమైన ప్రేమ గగన తలంలో విహరిస్తూ, తనకై ఆరాటపడేవారికి అందకుండా పైపైకి పోతూ ఉంది. అయినా అంత ఎత్తుకు ఎగిరి దానిని అందుకున్న వారి జీవితం స్వర్గమే అవుతుంది.


ఇలా కొందరి ప్రేమ జీవితాలను స్వర్గమయం చేసే అసలు సిసలైన ప్రేమ ఎలా ఉంటుందీ..?

అనే ప్రశ్నకు ఇప్పటికీ ఎవరూ సరైన వివరణను ఇవ్వలేకపోయారు. ఎంతోమంది కవులు, రచయితలు, ప్రేమికులు ప్రేమను ఆస్వాదించి, అనుభవించి కూడా దానికి ఇప్పటికీ సరైన వివరణను ఇవ్వకపోవడమే ప్రేమ యొక్క లోతుకు నిదర్శనం. ప్రేమ అనేది రెండు అక్షరాల కలయిక.
అంతేనా రెండు హృదయాల మధ్య ఏర్పడే బంధం.
ఈ ప్రేమ ఎంతటి కార్యన్నైనా సాధించే శక్తిని, ఆత్మస్ధైర్యాన్ని, పట్టుదలను అందిస్తుంది.

ఇదే ప్రేమ మూర్ఖత్వాన్ని, రాక్షసత్వాన్ని కూడా పుట్టిస్తుంది. చరిత్రలో జరిగిన ఎన్నో యుద్ధాలకు ప్రేమే మూలకారణం.

.


No comments:

Post a Comment